నిశీది

రాళ్ళకు బండలకు నాకన్న కొమలమైన హృదయం వుంటుందేమో!!!!. ముల్లు నాకన్న ఎక్కువ జాలి చూపిస్తాయ? సింహలు కూడా అకలి తిరినాక వేటాడవట మరి నెను? ఇక్కడ కూడ పొటి పడడం తప్పదేమో.#@!!.&%.#@*!

అనుభవం నేర్పిన పాఠం

మనుషులను గమనిస్తున్నాను కొత్తపాఠాలు నేర్చుకుంటున్నాను. జీవితం లో ఎంతవరకు ఉపయొగపదతాయొ చూడాలి.
ని అబివృద్ది(డబ్బు, స్థాయి) పైనే అందరు ఇచే గౌరవం ఆదారపడి వుంటుంది. మంచితనం గౌరవానికి ఇంకొంత మెరుగు తెస్తుంది కానీ అదే అసలుగా గౌరవాన్ని సంపాదించలేదు.
పైపెచ్చు వుట్టి మంచితనం అసమర్ధతని ఆపాదించి పేడుతుంది.

dev

తలకట్లు తప్పులు

క్షమించాలి తప్పులు ఉంటే. ఎందుకంటే తెలుగన్న మమకారం వున్నా సరిగా రాయలేని అచేతనం.


ఏంటమ్మా!!! ఆ అచేతనం అంటే?

చానా ఉంది వెనక్కి వెళితే.............

నేను డిగ్రీ చదువుతున్న రోజులనుకుంటా! కష్టంగా ఎందరో వ్యాసాలకు ఉత్తేజితమై, ఈనాడు ఆదివారం పుస్తకంలో డైరీ అన్నకదనానికి కదలిక వచ్చి డైరీ రాయడం మొదలుపెట్టా. నాకు నచ్చినట్టుగా ఈ రోజు తిన్న,క్రికెట్ ఆడాను,కర్చులు,వాటి లెక్కలు ఇలా జరిగేది నా వచనం. ఇంతకన్న విషయం ఏమి వుండేది కాదు అందులో. అందులో నా కష్టాలను ఏమి రాసేవాన్ని కాదనుకొండి. ఇక గోప్పలంటార చెప్పుకునేంత ఏమిసాదించలేదు కనుక ఎమి రాసేవాన్ని కాదు.(అంటే మా గల్లి క్రికెట్ లో చేసిన 100 runs తప్ప).

ఒక దుర్దినాన అది మా నాన్న కంట్లో పడింది. దాన్ని ఎవరికీ దొరకకుండా చానా తెలివిగా దాచేవాన్ని. కానీ ఏఁ చేస్తాం చిక్కేసింది.

మా నాన్న గురించి చెప్పలేదు కదు. అతను శంకరాబరణం లో శంకర శాస్త్రి లాంటి వారు. అంటే సంగీత పండితులనుకునేరు. బడి పంతులు మాత్రమే. శంకర శాస్త్రి తో ఎందుకు పోల్చానంటే మా నాన్న గారు ఓ 15 సంవచ్చరాలు ఎకోపద్యాయ పాఠశాలకు solo teacher. అతని service లో 3 సర్లే c.l తీసుకున్నారు. ఎవడో 14th luie(లూయి) చక్రవర్తి స్నానం చేసినట్టు.


అలాంటి మా శంకర శాస్త్రి నా డైరీ చదివి ఊరుకంటాఢా. అంటే నన్ను ఏమి అనలేదు లెండి.

కాని ఆ రొజు ఇంటికి రాగానె back ground లొ త ధి తొం ………, తొం తొం తొం………., తద్దిన దిద్దిన్ తందినకడ ………………… అని score music. ఏంటొ అమొహం లొని ఫీలింగ్స్ చదవలెక పొయాను. కాని ఏదొ జరగరానిది జరిగింది అని మాత్రం తెలుసు.

నా రూం లొ కి వెల్లి న డైరి తీయగానె అది ఏగిరి ఏగిరి పడుతుంది. ఏంట అని చుస్తె ! అరొజు పేజిలొ ఇలా రాసి వుంది.( ఈ పేజిలొ అ ఆ లు అన్ని రాయి అని ) ఇప్పుడు ఎగరడం నా వంతైంది.

ఇక తమాయించు కొని మెల్లిగా ఒక్కొ పేజి వెనక్కీ తిప్పడం మొదలెట్టా . ఏముంది ఏ పేజి చుసిన గర్వకారణం మా శాస్త్రి గారి నిబద్దతకు నిలువు టద్దం. ఒక్క పేజి కదు ఒక్కline(లైను ) కూడ విడవకుండ red pen తొ టిక్క్(tick) చెసి పెట్టాడు . ప్రతి పేజి చివరన ఒక సున్నచుట్టి అందులొ పైన తప్పుల సంఖ్య క్రింద పదాలు,వరసల సంఖ్య వెసాడు.


అంతె నా అంటె నేను రాసుకున్న చిల్లర డబ్బుల లెక్కలను ఒక account type లొ debit credit record రాసి balance sheet చెసి వుంచాడు.
అల తీస్తి తీస్తు మొదటి పేజికి వచ్చ. డైరి 2002 అన్న దాని కింద tag line లొ యిలా రాసి వుంది .


తలకట్లు దీర్గలు రాకుండ ఎళ్ళ వచ్చావురా ఇంత వరకు.



నాకు మతి పొంయింది ఇంక ఏముంది డైరి ములకు పడింది మళ్ళి రాస్తె ఒట్టు.





ఇదిగొ మళ్ళి యిలా!!..................................

ఏంచేస్తున్న !!!!!!!! ??????

సంతోషం సరిహద్దులో నే ఉన్నా
విషాదం నీడలు తాకుతువున్న.

ఆనందం కొలనులో కేరింతలు కొడుతున్న
కష్టాల కడలి ముంచేస్తువున్న.

విశ్వాసం వదలి పోలేదు
నమ్మకం చదరి పోలేదు
దురదృష్టం వెంటాడుతున్న.

ఆశతో భవిష్యత్ లోకి తొంగి చూస్తున్న......................

నాగురించి

నా ఫోటో
తెలుసుకునెంత గొప్పది కాదు. చెప్పేంత చిన్నది కాదు